నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి అంటూ సిగ్గుపడిపోయిన అల్లు అర్జున్
on Jun 4, 2023
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ స్టేజికి వచ్చేసింది. ఈ షోని మరింత ఐకానిక్ గా మార్చడానికి అల్లు అర్జున్ కూడా వచ్చారు. ముందుగా సౌజన్య కంటెస్టెంట్ గా వచ్చి తన టాలెంట్ ని చూపించింది. ఆమె వాయిస్ కి తెలుగులో ఉన్న స్పష్టతకు అల్లు అర్జున్ ఫిదా ఇపోయారు. అలాగే సౌజన్య కూతురు మిహిరని బ్లెస్స్ చేశారు. థమన్ సౌజన్య పెర్ఫార్మెన్స్ ని బాగా మెచ్చుకున్నారు. ఇక తనకు ఒక సాంగ్ పాడినందుకు సౌజన్యకు స్టేజి మీదకు వెళ్లి చెక్ కూడా ఇచ్చారు. సెకండ్ కంటెస్టెంట్ గా కార్తికేయ వచ్చి పాటలు పాడేసరికి అల్లు అర్జున్ సీట్ లో కూర్చుని స్టెప్స్ వేస్తూ ఉన్నారు. పెర్ఫార్మెన్స్ ఐపోయాక కార్తికేయని పిలిచి అల్లు అర్జున్ అని పేరుతో "ఏఏ" అనే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్న క్యాప్ ని ప్రెజెంట్ చేశారు.
తర్వాత థర్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన శృతి నండూరి పెర్ఫార్మెన్స్ కి మార్క్స్ వేసేసారు. ఇక తన తెలుగు ఎంత బాగుందో ఇంగ్లీష్ కూడా అంతే బాగుంది అంటూ మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ అనే పేరులోని "ఏఏ" అనే ఇంగ్లీష్ అక్షరాలతో చేసిన ఒక లాకెట్ ని స్వయంగా ఆయనే స్టేజి మీదకు తీసుకెళ్లి ప్రెజంట్ చేశారు. "అందరూ నా దగ్గరకు వస్తే గిఫ్ట్స్ ఇచ్చాను కానీ నీకు మాత్రమే ఈ స్టేజి మీదకు వచ్చి ఎందుకు ఇచ్చానంటే నువ్వు అమెరికా నుంచి ఇంత దూరం వచ్చినప్పుడు నేను మాత్రం స్టేజి వరకు రాలేనా అన్నారు. ఇక శృతి నీ పేరంటే నాకు ఇష్టం అని ఎందుకంటే తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి అని గుర్తు చేసుకుని తెగ సిగ్గుపడిపోయారు అల్లు అర్జున్. శృతి నువ్వు డాక్టర్ వి సింగర్ వి కూడా..ఐతే నీకు మామూలు సంబంధాలు రావు" అన్నారు.
Also Read